: మరో నిర్భయ ఉదంతం.. అత్యాచారం చేసి లారీలోంచి తోసేశారు
కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారం చేసి తోసేసిన ఘటన చేసిన గాయం మరువక ముందే, మన రాష్ట్రంలో అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. అయితే అక్కడ వాహనం బస్సైతే... ఇక్కడ వాహనం లారీ. మెదక్ జిల్లా రామాయం పేట్ కు చెందిన మహిళ హైదరాబాద్ వెళ్లేందుకు లారీ ఎక్కింది. మార్గమధ్యలో ఆమెపై అత్యాచారం చేసిన డ్రైవర్ బచ్చన్నపేట మండలం తమ్మపల్లి వద్ద లారీ నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.