: ఇటలీ మాఫియాకి, ఇడుపులపాయ మాఫియాకు లింకు కుదిరింది: యరపతినేని
ఇటలీ మాఫియాకి, ఇడుపులపాయ మాఫియాకి లింకు కుదిరిందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ సీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. దీనికి నిదర్శనం కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతల సతీమణులు ఒకే లేఖపై సంతకాలు చేయడమేనన్నారు. జగన్ బెయిల్ కోసం కడప పౌరుషం నీరుగారిందని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కుట్రలు, రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.