: రాజీనామాలు చేస్తే తీర్మానం ఎలా ఆగుతుంది?: మంత్రి ఏరాసు
ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టైనా తెలంగాణ తీర్మానం చేయించుకునే ప్రమాదముందని న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకోవాలంటే పదవులకు రాజీనామాలు చేస్తే ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ప్రజాప్రతినిథులు రాజీనామాలు చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించిన మరుక్షణం పదవులను వదులుకుంటామని ఆయన అన్నారు.