: లగడపాటి కంటే గొప్ప సమైక్యవాది రాష్ట్రంలో లేడు: జేసీ
ఎంపీ లగడపాటి రాజగోపాల్ కంటే గొప్ప సమైక్యవాది రాష్ట్రంలో ఎవరూ లేరని మాజీ మంత్రి జేసీదివాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ లగడపాటిపై నిన్న ఆటోనగర్ లో జరిగిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దని ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇతర పార్టీలతో కలిసి పోరాడుదామని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని వీడడానికి కూడా తాము సిద్థంగా ఉన్నామని స్పష్టం చేశారు.