: మూడో ఫ్రంట్ పై చర్చించలేదు: శరద్ యాదవ్
ధర్డ్ ఫ్రంట్ పై తాము చర్చించలేదని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో ప్రజల్లో అసంతృప్తి రగులుకుందని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.