: త్వరలో 'సేవ్ డెల్టా' ఉద్యమం: ఆలపాటి రాజేంద్రప్రసాద్
రాష్ట్ర విభజన వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాకు వాటిల్లనున్న నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు 'సేవ్ డెల్టా' ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ కృష్ణా డెల్టాపై అధ్యయనం చేసిన నిపుణులను ఉద్యమంలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రైతులు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున ఈ ఉద్యమంలోకి పాల్గోవాలని ఆయన పిలుపునిచ్చారు.