: కూకట్ పల్లిలో టీఆర్ఎస్ నేతలు అరెస్టు
కూకట్ పల్లి పద్మావతి గార్డెన్స్ లో సకల జనభేరి సన్నాహక సభ నిర్వహించేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా సభ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు కూకట్ పల్లి పోలీసులు స్పష్టం చేశారు. బహిరంగ సభలపై మరో ఆరు నెలలపాటు నిబంధనలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే.