: సచిన్ సేనను మట్టికరిపించిన ద్రవిడ్ సేన


ఛాంపియన్స్ లీగ్ తొలి టీ ట్వంటీ హోరాహోరీగా సాగింది. చివరిసారిగా మైదానంలో ఎదురుబొదురుగా తలపడుతున్న భారత దిగ్గజ ఆటగాళ్ల విన్యాసాలు చూద్దామని స్టేడియానికి వచ్చిన అభిమానులను నిరాశకుగురి చేస్తూ సచిన్, ద్రవిడ్ ఇద్దరూ బ్యాటింగ్ లో విఫలమయ్యారు. అయితే స్టార్ ల కంటే సమష్టితత్వాన్ని నమ్ముకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మరోసారి సత్తాచాటింది. దీంతో ఫేవరేట్ గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు తీసుకుని, కేవలం 142 పరుగులకే కట్టడిచేసి రాజస్థాన్ రాయల్స్ శభాష్ అనిపించుకుంది. పేసర్ విక్రమ్ జీత్ మాలిక్ అద్భుత ప్రతిభతో మూడు వికెట్లు తీసి రాణించగా సంజు శాంసన్ 54 పరుగులతో అదరగొట్టి రాజస్థాన్ రాయల్స్ ను విజయపథంలో నడిపారు. దీంతో రాజస్థాన్ జట్టు 19.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మాలిక్ నిలిచాడు.

  • Loading...

More Telugu News