: హస్తినలో బాబు బిజీబిజీ
ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు బిజీబిజీగా గడపనున్నారు. నిన్న పలువురు ముఖ్య నేతలను కలిసిన చంద్రబాబు నాయుడు నేడు మరికొందరు నేతలను కలువనున్నారు. అందులో భాగంగా మధ్యాహ్నాం 12 గంటలకు సీపీఐ నేత ఏబీ బర్థన్ తో సమావేశమవ్వనున్నారు. ఆ తరువాత ఒంటి గంటకు జేడీయూ నేత శరద్ యాదవ్ తో సమావేశం కానున్నారు. అనంతరం ఇతర పార్టీల నేతలను కూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.