: బిట్రగుంట-కావలి రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు
నెల్లూరు జిల్లా బిట్రగుంట-కావలి రైల్వేస్టేషన్ల మధ్య ఈ రోజు తెల్లవారుజామున కన్యాకుమారి నుంచి హౌరా వెళ్ళే ఎక్స్ ప్రెస్ రైలు(12666) ఆవులను ఢీకొనడంతో పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ చాకచక్యంగా బండిని నిలిపివేయడంతో ఒక భోగీ మాత్రమే పట్టాలు తప్పింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదని వారు తెలిపారు. వెంటనే మరమ్మత్తులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు.