: వాజేడు మండలంలో 25గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో ఈ రోజు ఉదయం నుంచి 25గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. మండలంలోని చీకుపల్లి వాగు కాజ్ వే పై మూడు అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి వరద పోటు, బొగత జలపాతం నుంచి వరద నీరు వస్తుండడంతో చీకుపల్లి వాగుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది.