: ఎన్టీఆర్ స్టయిల్ మార్చిన భార్య!


ఎన్టీఆర్ స్టయిల్ మార్చాడు. ఎప్పుడూ సినిమా వేడుకలకు క్యాజువల్ డ్రెస్సింగుతో వస్తుంటాడు. అయితే, ఈ రోజు పూర్తిగా మార్చాడు. 'రామయ్యా వస్తావయ్యా' ఆడియో వేడుకకు ఫార్మల్స్ ధరించి, ఇన్ షర్ట్ చేసుకుని, నీట్ గా స్టూడెంట్ లా వచ్చాడు. ఈ రోజు ఇతని స్టయిలే ఈ వేడుకకు హైలైట్ అయింది. వినాయక్, రాజమౌళి కూడా దీని గురించే ప్రస్తావించారు.

అయితే, ఎన్టీఆర్ ఇలా ఇన్ షర్ట్ చేసుకుని రావడం వెనుక అతని భార్య ప్రణతి సలహా వుంది. 'ఇది వేసుకోకపోతే కుదరదని' ఆమె వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఈ విషయాన్ని రాజమౌళి చెబుతూ, 'ఈ క్రెడిట్ ప్రణతికే చెందుతుంద'ని అన్నాడు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరియర్లో సూపర్ డూపర్ హిట్ గా మిగులుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. చివర్లో అభిమానుల కోరికపై, ఈ సినిమాలోని 'పందేలు గుర్రాల మీద వేసుకోవాలిరా... సింహాల మీద కాదు' అన్న డైలాగుని తనదైన శైలిలో చెప్పి అలరించాడు.

  • Loading...

More Telugu News