: 'రాష్ట్రం విడిపోతే నదీ జలాల సమస్యను తీర్చగలరా?'
విశాఖ ఆర్కేబీచ్ లో రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యగర్జన సభ కొనసాగుతోంది. ఈ సభలో జేఏసీ నేతలు మాట్లాడుతూ.. 54 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోందని, అయినా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి తెలంగాణ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని కారణంగా చూపుతున్నారని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం కనిపించదా? అని వక్తలు ప్రశ్నించారు. విడిపోతే నదీ జలాల సమస్యను ఎలా తీరుస్తారో ముందుగా చెప్పాలని సూటిగా అడిగారు.