: 300 అడుగుల జాతీయ జెండాతో మానవహారం
సమైక్యాంధ్ర ఉద్యమంలో జాతీయ సమైక్యత ఉట్టిపడుతోంది. జాతీయ జెండాతో సమైక్యవాదులు కదంతొక్కుతున్నారు. కడప జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏవీఆర్ పాఠశాల విద్యార్థులు 300 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. మైదుకూరు ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.