: బాలికను నిర్బంధించి అత్యాచారం
అనంతపురం జిల్లా గుంతకల్లులో ఓ కామాంధుడు పన్నెండేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు. మస్తాన్ అనే వ్యక్తి ఓ బాలికను అమానుషంగా నిర్బంధించి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మస్తాన్ పై పోలీసులు నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.