: ఎందుకు నిర్బంధించారో చెప్పలేదు: బాబా రామ్ దేవ్
లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టులో తనను నిర్భంధించినందుకు అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని బాబా రామ్ దేవ్ అన్నారు. తనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలంటూ అధికారులను పదేపదే అడిగానని.. కానీ, చెప్పకూడదన్నారని రామ్ దేవ్ తెలిపారు. ఇంతవరకు తన జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదన్న రామ్ దేవ్, ఎలాంటి నేరం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న లండన్ వెళ్లిన ఆయనను ఎయిర్ పోర్టు అధికారులు నిర్బంధించి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.