: అందరి రాజీనామాల కోసం విజయమ్మ డిమాండ్
రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగాలంటే అందరూ రాజీనామాలు చేయాల్సిందేనంటున్నారు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ. కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల అధినేతలు అందరూ రాజీనామా చేసినప్పుడే సమైక్య రాష్ట్రం సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాదులో నేడు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం వైఎస్సార్సీపీ ఎన్నడూ పాకులాడలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ లే ఓట్లు, సీట్ల కోసం వెంపర్లాడతాయని ఎద్దేవా చేశారు. ఇక వైఎస్సార్ కలలను నిజం చేసేందుకు శ్రమించాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.