: ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసమే తెలంగాణ డిమాండ్: డిప్యూటీ సీఎం
ప్రత్యేక తెలంగాణను ఆ ప్రాంత ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆత్మ గౌరవం, స్వపరిపాలన కోసమే తెలంగాణ డిమాండ్ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో యువత, ఓయూ, కేయూ విద్యార్ధుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగువారిగా కలిసుందామని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి.. హైదరాబాదులోని సీమాంధ్రులు సెటిలర్లు కాదు.. స్థానికులేనన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులంతా తెలంగాణ కోరుకుంటున్నారన్నారు. 2004, 2009లో తెలంగాణపై అనుకూలమని చెప్పిన సీమాంధ్ర నేతలకు అప్పుడులేని ఆక్షేపణ ఇప్పుడెందుకు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీపై మండిపడ్డ డిప్యూటీ సీఎం, ఆ పార్టీ 2008లో లేఖ ఇచ్చి రాష్ట్రంలో వైషమ్యాలను రెచ్చగొట్టిందన్నారు.