: ఈ నెల 23 నుంచి 30 వరకు విద్యాసంస్థలు బంద్: అశోక్ బాబు


సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 23 నుంచి 30 వరకు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చినట్లు ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బంద్ పాటిస్తున్న రోజుల్లో నష్టపోయే తరగతులను దసరా సెలవుల్లో పాఠశాలలు నడిపించి, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించాయని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల వద్ద నిరసనలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో 'సద్భావన సదస్సు' నిర్వహించేందుకు ఆలోచిస్తున్నట్టు చెప్పారు. సమస్యలపై ఇరు ప్రాంతాల మంత్రులు కూర్చుని చర్చించుకోవడం సంతోషం కలిగిస్తోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News