: నేడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్
పార్లమెంటులో ఆర్ధికమంత్రి చిదంబరం ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆయన 8వ సారి లోక్ సభలో బడ్జెట్ పెట్టిన వ్యక్తిగా అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నారు. అంతకుముందు
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్ధిక మంత్రిగా ఎనిమిదిసార్లు బడ్జెట్
ప్రవేశ పెట్టారు. దాంతో మొరార్జీ తరువాత ఆ రికార్డు చిదంబరంకే దక్కనుంది. మరోవైపు యూపీఏ-2 ప్రభుత్వంకు ఇది చివరి బడ్జెట్. 2014లో సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ నే ప్రవేశపెట్టాలి. కాబట్టి, దీనిని ఎన్నికల బడ్జెట్ గానే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.