: లగడపాటి అనుచరుల దాడికి నిరసనగా ఆటోనగర్ బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆటోనగర్ లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులపై ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుచరుల దాడిని నిరసిస్తూ ఆటోనగర్ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చారు. అనంతరం ఆటోనగర్ గేటు వద్ద రాస్తారోకో చేపట్టారు. కార్మికుల రాస్తారోకో సందర్భంగా బందరు రోడ్డులో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లగడపాటి కార్మికులకు క్షమాపణలు చెప్పాలంటూ ఆటోనగర్ కార్మికసంఘాలు డిమాండ్ చేశాయి.