: రాష్ట్రపతిని కలిసిన సీమాంధ్ర నేతల సతీమణులు
ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు కొద్దిసేపటి కిందట కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతిని కోరనున్నారు. అంతేగాక, రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాలు, విభజన ప్రకటనతో సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, సమ్మె గురించి వివరించనున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదంటూ నిన్న కేంద్రమంత్రి మనీష్ తివారి స్పష్టం చేయడంతో సీమాంధ్ర నేతలు వారి భార్యలతో హస్తినకు రాయబారం పంపారు.