: కేవీపీని వెంటనే అరెస్ట్ చేయాలి: వర్ల రామయ్య
తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కు మధ్య బ్రోకర్ గా వ్యవహరిస్తున్నందునే కేవీపీని సీబీఐ వదిలేస్తోందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాదులో వర్ల నేడు మీడియాతో మాట్లాడారు. జగన్ అక్రమాస్తుల కేసులో కేవీపీని విచారించిన సీబీఐ... ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. టెన్ జన్ పథ్ కు లోటస్ పాండ్ కు కేవీపీ అనుసంధానకర్తగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యంత అవినీతిపరుడైన కేవీపీని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.