: కడప డీసీసీబీ వైయస్సార్ పార్టీ కైవసం


కడప డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆఖరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొదటి నుంచీ పలు మలుపులు తిరుగుతూ, మూడు సార్లు వాయిదా పడిన ఈ ఎన్నిక, చివరికి హైకోర్టు జోక్యంతో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు జరిగింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లు గైర్హాజరు కావడంతో, వైయస్సార్ పార్టీకి చెందిన ఎనిమిది మంది డైరెక్టర్లు కలిసి తిరుపాల్ రెడ్డిని డీసీసీబీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలూ జరుగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేబట్టారు.  

  • Loading...

More Telugu News