: అక్టోబరు 5 నుంచి ప్రకాశం జిల్లాలో బాబు 'ఆత్మగౌరవ యాత్ర'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబరు 5 నుంచి ప్రకాశం జిల్లాలో 'ఆత్మగౌరవ యాత్ర' చేపట్టనున్నారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు కరణం బలరాం హైదరాబాదులో మాట్లాడుతూ.. పర్చూరు నియోజకవర్గంలోని చిన నందిపాడు నుంచి బాబు యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. పది రోజుల పాటు జరగనున్న ఈ యాత్ర ఏడు నియోజక వర్గాల్లో సాగుతుందని వివరించారు. పర్చూరు, అద్దంకి, దర్శి, మార్కాపురం, కొండేపి, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల మీదుగా నెల్లూరు జిల్లాకు వెళతారని ఆయన తెలిపారు.