: దొంగ టీచర్ గారి లీలలు
దురాశ దుఃఖానికి చేటు అంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువే గడ్డి తిన్నాడు! ఉన్నపాటునే ధనవంతుడు అవ్వాలన్న అత్యాశతో దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగతనం నేరం అంటూ విద్యార్థులతో నీతి పాఠాలు వల్లించిన మాస్టారు తాను మాత్రం దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు. తమిళనాడులోని వేలూరు జిల్లాలో మదన్ మారన్(34) అనే స్కూల్ టీచర్ ధనవంతుడవ్వాలన్న దురాశతో చిల్లర దొంగతనాలకు పాల్పడ్డాడు. 73 విలువైన బంగారు అభరణాలను దొంగిలించాడు.
వాటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుంది. 2004లో మారన్ హోసూర్ సమీపంలో గ్రామీణ పాఠశాలలో టీచర్ గా జాయిన్ అయ్యాడు. ఆయనపై దొంగతనం కేసు నమోదు కావడంతో గతేడాది అతనిని విధుల నుంచి తొలగించారు. రెండు నెలల క్రితం వేలూరు వెళ్లి పాఠశాలలో టీచర్ గా చేరాడు. దొంగతనాలకు అలవాటుపడ్డ మారన్ అక్కడ కూడా అలవాటు ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. అతనిని అరెస్టు చేసిన పోలీసులు మొత్తం 18 కేసులు నమోదు చేశారు.