: దర్శకుడు మణిరత్నంకు పోలీసు భద్రత


ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు పోలీసు భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ప్రకారం ఇంటివద్ద, ఆఫీసు వద్ద ఇద్దరేసి పోలీసులను ఆయన భద్రత కోసం నియమిస్తారు.

1995 లో 'బాంబే' సినిమా తీసిన సమయంలో మణిరత్నంకు బెదిరింపులు రావడంతో భద్రత కోసం పోలీసులను నియమించారు. తదనంతర కాలంలో ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. అయితే, ఇటీవల 'కడలి' సినిమా విడుదలైన సందర్భంలో మణిరత్నం ఇంటిపైన, ఆఫీసుపైన పంపిణీదారులు దాడి చేయడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.               

  • Loading...

More Telugu News