: స్పష్టత వచ్చేవరకూ సమ్మె తప్పదని చెప్పాం: అశోక్ బాబు
విభజనపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేవరకూ ఏపీఎన్జీవోల సమ్మె కొనసాగుతుందని కోర్టుకు తెలిపినట్టు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. సమ్మెపై వాదనల సందర్భంగా హైకోర్టుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసమే తాము సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. వాదనల సమయంలో సమ్మెను కొనసాగిస్తారా? అని కోర్టు అడిగిందన్నారు. తమ స్టేట్ మెంట్ ను ప్రధాన న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారని అశోక్ బాబు వెల్లడించారు. ముందుకెళుతున్నామని కేంద్రం చెబుతోందని, ఏ విషయంపై ముందుకెళుతుందో వేచి చూస్తామన్నారు. అయితే, సోమ, మంగళ వారాల్లో హైకోర్టు తీర్పు వస్తుందని భావిస్తున్నామన్నారు.