: కేబినెట్ నోట్ పూర్తి కాలేదు: ఎంపీ అనంత
కేబినెట్ నోట్ ఇంకా పూర్తి కాలేదని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఢిల్లీలో హోం మంత్రి షిండేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నోట్ ఇంకా పూర్తిస్థాయిలో తయారుకాలేదని షిండే తమతో చెప్పినట్టు అనంత వెల్లడించారు. రాష్ట్రంలో ఏకాభిప్రాయం వచ్చిన తరువాతే తెలంగాణ నోట్ క్యాబినెట్ ముందుకు వస్తుందని హోం మంత్రి తెలిపారని అనంత పేర్కొన్నారు.