: షిండేకు అంతా తెలుసు: సాయిప్రతాప్
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అన్ని విషయాలు తెలుసని కాంగ్రెస్ ఎంపీ సాయిప్రతాప్ తెలిపారు. షిండేతో భేటీ అనంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేబినెట్ నోట్ ఇంకా తయారు కాలేదని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తాము సమైక్యానికే కట్టుబడి ఉన్నామని, సమైక్యాంధ్ర సాధనకు అనుగుణంగా తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజల, ప్రజాప్రతినిధుల మనోభావాలను మరోసారి షిండేకు చెప్పామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎంపీ సాయిప్రతాప్ వెల్లడించారు.