: డల్లాస్ లో 'సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి' ఆవిర్భావం
విభజన ప్రకటన నేపథ్యంలో నిరసనలు విదేశాలకు కూడా పాకాయి. తాజాగా, విభజనకు నిరసనగా అమెరికాలోని డల్లాస్ లో ప్రవాసాంధ్రులు 'సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి'ని ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా డల్లాస్ ప్రాంతంలో ఉద్యమం చేపట్టాలని ఇక్కడి జల్సా హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రవాసాంధ్రులు నిర్ణయించారు. గాంధీ జయంతి రోజున టెక్సాస్ రాష్ట్ర ప్రవాసాంధ్రులతో కలిసి 'ప్రవాసాంధ్ర పాదయాత్ర' చేపడతామని, హ్యూస్టన్ లోని భారత కాన్సులేట్ ఎదుట ధర్నా నిర్వహించి మెమోరాండం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.