: బ్యాటింగ్ కు దిగిన యువీ జట్టు
యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్-ఏ, పావెల్ నాయకత్వంలోని విండీస్-ఏ జట్ల మధ్య టీట్వంటీ మ్యాచ్ మొదలైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత-ఏ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప(32*), ఉన్ముక్త్ చాంద్(32*) ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది.