: 'వందేళ్ల సినీ వేడుక'లను ప్రారంభించనున్న జయలలిత
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నైలో నిర్వహిస్తున్న సినీ వేడుకలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ వేడుకలు మొదలవుతాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నేడు తమిళ పరిశ్రమకు చెందిన 50 మంది సినీ ప్రముఖులను సన్మానించనున్నారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి డీకే అరుణ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వీరే కాకుండా మరో 650 మంది వేడుకలకు హాజరవనున్నారు. రేపు 57 మంది తెలుగు సినీ ప్రముఖులకు సన్మానం జరుగుతుంది.