: రాష్ట్రపతితో భేటీ కానున్న సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సతీమణులు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సతీమణులు ఈ రోజు భేటీ కానున్నారు. వారికి ఈ రోజు మధ్యాహ్నం అపాయింట్ మెంట్ లభించింది. ఈ సందర్భంగా వారు రాష్ట్ర విభజన వల్ల జరిగే అనర్థాలతో పాటు, సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను రాష్ట్రపతికి వివరించనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాష్ట్రపతి చొరవ చూపాలని ఆయనను కోరనున్నారు.