: మార్చి 13న ఏపీఎన్జీవోల చలో అసెంబ్లీ
తమ డిమాండ్ల పరిష్కారం కోసం మార్చి 13న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని ఏపీఎన్జీవో నాయకులు వెల్లడించారు. పదో పీఆర్సీ అమలుతోపాటు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల రద్దు చేయాలని వారు కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి రేపు నోటీసు అందజేస్తామని వారు తెలిపారు. హైదరాబాద్ జంట పేలుళ్ల నేపథ్యంలో చలో అసెంబ్లీ మార్చి నెలలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వారు వెల్లడించారు.