: అక్కడ నీటితో ముఖం కడుక్కోవద్దు...


గతనెల ఒక బాలుడి మెదడులోకి ఒక అమీబా ప్రవేశించింది. అది మెదడును తినేసే ప్రాణాంతక అమీబా. చివరికి ఆ బాలుడు మరణించాడు కూడా. ఇలాంటి అమీబాలు కూడా ఉంటాయా? అని దీన్ని గురించి తెలియనివారు చాలామంది ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అయితే ఇలాంటి అమీబా ప్రజలకు సరఫరా చేసే తాగునీటిలో కనిపించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. అమెరికాలోని న్యూఓర్లీన్స్‌కు సరఫరాచేసే తాగునీటిలో ఇలా మెదడును తినేసే అమీబా వెలుగుచూసింది. నీగ్లేరియా అమీబా అనే పేరుగల ఈ అమీబా చక్కగా మెదడులోకి చేరి దాన్ని స్వాహా చేయడం మొదలుపెడుతుంది. తల్లిదండ్రులతో సెయింట్‌ బెర్నార్డ్‌ మందిరాన్ని సందర్శించేందుకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి గత ఆగస్టులో చనిపోగా, దీనికి కారణం ఈ విషపూరితమైన అమీబాయేనని వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ అమీబా ఎక్కడినుండి ఆ చిన్నారి శరీరంలోకి ప్రవేశించి వుంటుంది అనే విషయంపై అన్వేషణ ప్రారంభమైంది. ఈ అన్వేషణలో అక్కడ తాగునీటిలోనే అది ఉన్నట్టు తేలడంతో ఆ నీటి వాడకాన్ని నిలిపివేశారు.

గతంలో చనిపోయిన బాలుడు కూడా నీటిలో ఈత కొట్టే సమయంలో అతని చెవిద్వారా ఇలాంటి అమీబా మెదడులోకి ప్రవేశించివుంటుందని వైద్యులు భావించారు. అయితే ఈ అమీబా అంత సులభంగా మనుషులపై దాడికి పాల్పడదని, కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన పనిలేదని, అయితే మెదడులోకి వెళ్లే ప్రమాదం ఉన్నందువల్ల ఈ నీటితో ముఖం మాత్రం కడుక్కోవద్దని హెచ్చరిస్తోంది. కాగా ఈ ప్రాంతంలో 1962 నుండి అమీబా కారక ఇన్‌ఫెక్షన్లు ప్రజలను బాధిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ప్రాణాంతక అమీబా వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News