: విజయవాడ సభలో తన గీతంతో సభికులను ఉర్రూతలూగించిన అంధ ఉపాధ్యాయుడు


ఈ రోజు సాయంత్రం విజయవాడలో జరిగిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో గంగాధరం అనే అంధ ఉపాధ్యాయుడు తన సమైక్యాంధ్ర గీతంతో సభలో ఉన్న వారినందరిని ఉర్రూతలూగించారు. ఈయన మైలవరం ఉపాధ్యాయ జేఏసీ నుంచి వచ్చారు. గీతం ఆలపించడానికి ముందు ఆయన మాట్లాడుతూ తాను ఈ గీతాన్ని ఇప్పటికిప్పుడే రచించి పాడుతున్నట్టు చెప్పారు. తనకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో, తన గురువులు పంచిన జ్ఞానంతో, అందరి ఉత్తేజంతో ఈ పాటను పాడుతున్నట్టు చెప్పారు.

ఆయన ఈ గీతం ఆలపిస్తున్నంతసేపు వేదిక మీద ఉన్నవారు, సభకు వచ్చిన వారి నృత్యం, కరతాళధ్వనులతో సభ దద్ధరిల్లిపోయింది. గీతం పూర్తయిన తరువాత, ఎన్టీఆర్ గొంతును అనుకరిస్తూ 'అశేషమైన ఈ తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, తెలుగు జాతిని ఒక్కటిగా నిలపాలని స్వర్గలోకం నుంచి నేను మీ అందరిని ఆశీర్వదిస్తున్నాను, జై తెలుగునాడు, జై తెలుగునాడు, జై సమైక్యాంద్ర' అంటూ ముగించారు.

  • Loading...

More Telugu News