: తెలంగాణ అంటే 10 జిల్లాలు కాదు 23 జిల్లాలు: నల్లమోతు చక్రవర్తి


'తెలంగాణ అంటే కేవలం 10 జిల్లాలు మాత్రమే కాదు, 23 జిల్లాలు' అని విశాలాంధ్ర మహాసభ నేత నల్లమోతు చక్రవర్తి తెలిపారు. విజయవాడలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తెలుగుజాతి ఐక్యత కోసం జరిగిందని అన్నారు. రాష్ట్రం పేరును తెలుగునాడుగా మార్చాలని కొందరు పెద్దలు ఎప్పట్నుంచో కోరుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది విశాలాంధ్ర మహాసభ అని ఆయన గుర్తు చేశారు. తెలుగుజాతి ఐక్యతకు బీజం పడింది బెజవాడ గడ్డపైనేనని చక్రవర్తి తెలిపారు. నిజాం కాలంలో మూడు ప్రాంతాల ప్రజలు పన్నులు కట్టడం వల్లే హైదరాబాద్ ఏర్పడిందని తెలిపారు.

వేర్పాటు వాదులు చెబుతున్నట్టు 1956లో సీమాంధ్రులు హైదరాబాద్ రాలేదని, 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ ఆవిర్భావంలో తెలుగు జాతి మొత్తం ఉందని చరిత్రను ఉటంకించారు. కేవలం హైదరాబాద్ నిర్మాణం లోనే కాదని, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట, చార్మినార్ లలో కూడా సీమాంద్రుల సంపద ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉందని చెప్పడం వల్లే, కోస్తా ప్రజల పెద్దమనసుతో కర్నూలు రాజధానిగా ఏర్పడిందని గుర్తు చేశారు. వేర్పాటు వాదులు చెబుతున్నట్టు సమైక్య ఉద్యమం నిన్న మొన్న ఏర్పడ్డ ఉద్యమం కాదని, దానికి వందేళ్ల చరిత్ర ఉందని తెలిపారు. కావాలంటే చారిత్రక సాక్ష్యాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నామని నల్లమోతు చక్రవర్తి తెలిపారు.

  • Loading...

More Telugu News