: సీఎంపై ధ్వజమెత్తిన హరీష్ రావు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. సకలజనుల సమ్మెతో అభివృద్ధి ఆగిందని ఆర్టీసీ కార్మికులు, రైతులను సీఎం రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తాను సీమాంధ్ర పక్షపాతినని భావిస్తే.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం 50 రోజులుగా నడుస్తున్నా సీఎం ఎందుకు నోరు విప్పడంలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర పెత్తందార్లపై ఉన్న ప్రేమ ముఖ్యమంత్రికి ఎస్సీ, ఎస్టీ వర్గాలపై లేదని హరీష్ రావు అన్నారు.

  • Loading...

More Telugu News