: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి పదును: కేంద్ర హోం శాఖ
దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని పటిష్ఠం చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఖుర్షీద్ ఆహ్మద్ తెలిపారు. హైదరాబాద్ లో విదేశీ విరాళాల నియంత్రణ చట్టంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థలకు విదేశాలనుంచి అందే నిధులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని సంస్థలు చట్టాన్ని పట్టించుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అది చట్టవిరుద్ధమని, ఈ తరహా విషయాలు తమ దృష్టికి వస్తే ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.