: క్లాసులో బెంచిపై ఘర్షణ.. విద్యార్థి మృతి


చిన్నపాటి ఘర్షణ విద్యార్థి పాలిట శాపమైంది. గుంటూరు జిల్లా పెనుమాక జిల్లా పరిషత్ హైస్కూల్లో గుజ్జుల చంద్రశేఖర్ రెడ్డి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్ కు తొందరగా వచ్చిన చంద్రశేఖర్ ఆడుకుంటూ బెంచ్ పైకెక్కాడు. దీంతో సహ విద్యార్థి ఈశ్వర్ కల్యాణ్ ... బెంచ్ ఎక్కవద్దంటూ మిత్రుడిని మందలించాడు. దాంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో తన షర్టు చిరగడంతో కోపం పట్టలేకపోయిన ఈశ్వర్, చంద్ర శేఖర్ ని లాగిపెట్టి గూబమీద ఒక్కటిచ్చాడు అంతే... చంద్రశేఖర్ రెడ్డి కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెళ్లి టీచర్ని తీసుకొచ్చిసరికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు భోరున విలపిస్తూ మృతదేహాన్ని తీసుకెళ్లారు. అనంతరం వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేసి సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News