: హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ నగరం భారీ వర్షంలో తడిసి ముద్దయింది. నగరంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షాలతో చాలా చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్ పేట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.