: రైల్ రోకో కేసులో కోర్టుకు హాజరైన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె. తారక రామారావు (కేటీఆర్) సికింద్రాబాద్ లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద రైలు రోకో చేపట్టిన ఘటనలో పలువురు టీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ ఈ ఉదయం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.