: నాలుగు వేల కిలోల లడ్డూ నీటిపాలు
ఖైరతాబాద్ మహాగణపతికి సమర్పించిన లడ్డూ ప్రసాదం పాడైపోవడంతో ఈ రోజు దాన్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. తాపేశ్వరం నుంచి భక్తులు పంపిన లడ్డూ ప్రసాదాన్ని ఈరోజు పంపిణీ చేస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో, పలువురు భక్తులు మండపం వద్దకు చేరుకున్నారు. అయితే 4 వేల కిలోల ఆ భారీ లడ్డూను పరిశీలించిన ఆరోగ్యాధికారులు వివిధ కారణాల వల్ల లడ్డూ పాడైందని, తినడం ఆరోగ్యకరం కాదంటూ సూచించారు. దాంతో మండప నిర్వాహకులు లడ్డూను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. భక్తులు నిరాశ చెందారు.