: ప్రియుడి మోజులో కట్టుకున్న వాడ్ని కడతేర్చిన సాఫ్ట్ వేర్ అమ్మాయి


హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన టీవీ మెకానిక్ వెంకటేశ్వరరావు హత్యకేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భార్యే అతడిని కడతేర్చిందని వారు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మల్కాజిగిరికి చెందిన వెంకటేశ్వరరావు జూబ్లీ బస్ డిపోలో టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. నాచారంకి చెందిన ఓ యువతితో అతనికి నిశ్చితార్థం జరిగింది. అతనితో పెళ్లి ఇష్టం లేని ఆమె తాను ప్రేమించిన యువకుడితో ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న చిన్న కుమార్తె సౌజన్యను మే 29 న అతనికిచ్చి పెళ్లి చేశారు.

కానీ అప్పటికే సౌజన్య, జయదీప్ అనే మరో వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉంది. బెంగళూరు నుంచి ప్రతి శుక్రవారం బయల్దేరి వచ్చే సౌజన్య, ఈ నెల 13న తన ప్రియుడు జయదీప్ తో కలిసి వచ్చింది. జయదీప్ తన మిత్రుడు రాజ్ కుమార్ సహాయంతో పథకం ప్రకారం సంఘీ టెంపుల్ సమీపంలో వెంకటేశ్వరరావును కత్తులతో దాడి చేసి హతమార్చాడు. దోపిడీ కోసం హత్య జరిగినట్టుగా నమ్మించేందుకు సౌజన్యను కూడా గాయపరిచారు. అయితే సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

  • Loading...

More Telugu News