: కేసీఆర్ సీమాంధ్రుల్ని కించపరిస్తే సహించేది లేదు: నన్నపనేని
కేసీఆర్ సహా ఇతర టీఆర్ఎస్ నేతలు సీమాంధ్రుల్ని కించపరిస్తే సహించేది లేదని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ, సీమాంధ్రలో మేధావులే లేరంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కి తీసుకుని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల శ్రమను, ధనాన్ని దోచుకునేవారు ఏపాటి మేధావులో అందరికీ తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ప్రజల వల్లే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందనే అంశంపై కేసీఆర్ తో బహిరంగ చర్చకు సిద్థమని నన్నపనేని రాజకుమారి సవాలు విసిరారు.