: ఏపీఎన్జీవోల సమ్మె విరమింప చేయండి: సీఎంను కోరిన జానా
విభజనకు నిరసనగా దాదాపు 50 రోజుల నుంచి సమ్మె బాట పట్టిన ఏపీఎన్జీవోల సమ్మెను విరమింపజేయాలని మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గ సమావేశంలో కోరారు. ఇన్ని రోజులవుతున్నా వారి సమ్మెను విరమింపజేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. ఇందుకు స్పందించిన సీఎం.. మంత్రివర్గ ఉపసంఘం వారితో చర్చలు జరుపుతుందని సమాధానమిచ్చారు. అంతేగాక రచ్చబండపై కూడా జానా సీఎంను ప్రశ్నించారు. అంతా గంటలోపే జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం ప్రపంచ బ్యాంకు నుంచి వెయ్యి కోట్లు విపత్తు నివారణ శాఖ కోసం రుణం తీసుకోవడానికి ఓకే చెప్పింది. అటు విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.