: సమైక్యాంధ్ర ఒక్కటే మా డిమాండ్: సీమాంధ్ర ఎంపీలు
ఢిల్లీలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల భేటీ ముగిసింది. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఒక్కటే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఇదే విషయమై ఆంటోనీ కమిటీలోని ముగ్గురు సభ్యులను కలిసి తమ ఆకాంక్షను వివరించామని తెలిపారు. సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో కలుసుకుని భవిష్య కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్రరావు తదితరులు సీమాంధ్ర కేంద్ర మంత్రులతో భేటీ అయిన వారిలో ఉన్నారు.