: జగన్ కు రిమాండ్ పొడిగింపు
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు అక్టోబరు 3 వరకు రిమాండ్ పొడిగించింది. నిమ్మగడ్డ ప్రసాద్, కేవీ బ్రహ్మానందరెడ్డిలకు కూడా అదే తేదీ వరకు రిమాండ్ విధించింది. మరోవైపు, ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సహాయకుడు అలీఖాన్ కు కూడా అక్టోబరు మూడు వరకు రిమాండ్ విధించింది.