: టీ తాగితే అరెస్టు చేసేస్తారా?: ముంబై హైకోర్టు


అనుమానాస్పదంగా టీ తాగితే అరెస్టు చేస్తారా..? అంటూ బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో టీ తాగడంపై సంజాయిషీ ఇచ్చుకోవాలన్న విషయాలు చట్టంలో ఉన్నట్టు తమకు తెలియదంటూ కోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, పోలీసులకు చీవాట్లు పెట్టింది. కొల్హాపూర్లోని రాజారాంపురిలో శివాజీ యూనివర్సిటీ సమీపంలోని టీ స్టాల్ లో అనుమానాస్పదంగా టీ తాగుతున్న విజయ్ పాటిల్(49) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పదంగా టీ ఎందుకు తాగుతున్నాడో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని, అందుకే అరెస్టు చేశామనే పోలీసుల వాదనపై హైకోర్టు తీవ్రంగా స్పందించి కేసు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News